| Daily భారత్
Logo




ప్రతి కార్యాలయం పరిశుభ్రంగా ఉండాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్

News

Posted on 2026-03-10 12:06:47

Share: Share


ప్రతి కార్యాలయం పరిశుభ్రంగా ఉండాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్

నిరుపయోగ వస్తువులు, పరికరాలు తొలగించాలి.

రికార్డులు, ఫైళ్లు నిబంధనల ప్రకారం భద్రపరచాలి.

కలెక్టర్ గరిమ అగ్రవాల్.

ప్రజా పాలన -ప్రగతి ప్రణాళికలో భాగంగా ఐడీఓసీలో ప్రతి అంతస్తులోని కార్యాలయం తనిఖీ.

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : ప్రతి ప్రభుత్వ కార్యాలయం నిరుపయోగ వస్తువులు, పరికరాలు తొలగించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ప్రజా పాలన  ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం స్వచ్చత .. పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించగా, కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై తనిఖీ చేశారు.

గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ లోని నీటి పారుదల శాఖ, ఈఈ పీ ఆర్, ఆర్ అండ్ బీ, బీసీ సంక్షేమ శాఖ, డీటీ సీపీఓ, కార్మిక శాఖ, భూగర్భ శాఖ, డీఆర్ డీఓ, మైనింగ్, సీపీఓ, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, సహకార శాఖ, ఎక్సైజ్, విద్యా శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, పౌర సరఫరాల శాఖ, ఉపాధి కల్పన శాఖ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, జిల్లా పంచాయతీ ఆఫీస్, ట్రెజరీ శాఖ, ఏవో ఆఫీస్, డీపీఆర్ఓ, సంక్షేమ శాఖ తదితర కార్యాలయాలను కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి తనిఖీ చేశారు. ఆయా కార్యాలయాల్లోని వివిధ గదుల్లో ఉన్న ఫర్నిచర్, ఫైల్స్, రికార్డులు, సామగ్రి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రతి జిల్లా శాఖ కార్యాలయం, మండలాల్లోని కార్యాలయాలు నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యాలయంలోని ఫైళ్లు, రిజిస్టర్లు స్టోర్ రూమ్ లా సిద్ధం చేయాలని, నిబంధనల ప్రకారం భద్రపరచాలని స్పష్టం చేశారు. అనవసరమైనవి తొలగించాలని సూచించారు. కార్యాలయం ఆవరణలోని నిరుపయోగ వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు తొలగించాలని ఆదేశించారు. అందుబాటులో ఉన్న కుండీల్లో మొక్కలు పెట్టించాలని కలెక్టర్ తెలిపారు. ఈ పరిశీలనలో కలెక్టరేట్ ఏవో రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Image 1

యువతే దేశ భవిష్యత్తు...

Posted On 2026-06-25 18:38:19

Readmore >
Image 1

జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను తప్పక సాధించాలి : డి ఎం హెచ్ వో డాక్టర్ జె వెంకటి

Posted On 2026-06-25 18:35:11

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొరత లేదు : ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-06-25 18:33:22

Readmore >
Image 1

ఆపరేషన్ కవచ్‌లో కామారెడ్డి పోలీసుల పంజా

Posted On 2026-06-25 18:31:09

Readmore >
Image 1

ఈ నెల 28 నుంచి 30వ తేది వరకు పల్స్ పోలియో : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-25 18:23:12

Readmore >
Image 1

ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం నింపాలి.. పాస్ పోర్ట్ సైజ్ ఫొటో ఇవ్వాలి

Posted On 2026-06-25 18:21:26

Readmore >
Image 1

వరంగల్ : అక్రమ పచ్చడి తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ దాడి

Posted On 2026-06-25 18:18:41

Readmore >
Image 1

పిల్లల ఆన్‌లైన్ గేమింగ్.. తల్లిదండ్రుల అజాగ్రత్తతో ఆర్థిక నష్టం

Posted On 2026-06-25 12:51:14

Readmore >
Image 1

పెళ్లి పేరుతో ప్రేమ, నగదు, బంగారం కాజేత

Posted On 2026-06-25 12:45:33

Readmore >
Image 1

"డ్రగ్స్ ఫ్రీ సిరిసిల్ల కోసం యువత ముందుకు రావాలి"

Posted On 2026-06-25 12:30:42

Readmore >